టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఈనెల 25న ప్రకటించనున్నారు.  ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30 న ప్రారభం కానుంది. ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వ తేదీ వరకు ఆన్ లైన్ లో […]

Written By: Suresh, Updated On : August 10, 2021 7:08 pm
Follow us on

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఈనెల 25న ప్రకటించనున్నారు.  ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30 న ప్రారభం కానుంది. ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వ తేదీ వరకు ఆన్ లైన్ లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్టాట్ బుక్ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.