https://oktelugu.com/

మందు బాబు చేతిలో బాంబు.. జనం పరుగులు.. చివరికి

గొంతులో మందు పడితే చాలు స్వర్గం కనిపిస్తుంది. చుక్క పడితే కానీ డొక్కాడని వారుంటారు. పెగ్గు పడితే కాని పనిలో దిగరు. మందు తాగితే చాలు మహారాజులమని బుకాయిస్తారు. అందరిని పిచ్చోళ్లలా చూస్తారు. ఎవరు అడ్డు వచ్చినా తోసేస్తారు. తమకు తామే హీరోలా భావించుకుని నానా హంగామా చేస్తారు. ఎవరైనా వారిస్తే వారినే గెంటేస్తారు. మత్తు దిగేదాకా వారికిష్టమైనదే చేస్తారు. మత్తు వదిలాక ఇక ఎవరి మొహం చూడకుండా చాటేస్తారు. అంతటి శక్తి మద్యానికి ఉంటుంది. అలాంటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 10, 2021 / 06:58 PM IST
    Follow us on

    గొంతులో మందు పడితే చాలు స్వర్గం కనిపిస్తుంది. చుక్క పడితే కానీ డొక్కాడని వారుంటారు. పెగ్గు పడితే కాని పనిలో దిగరు. మందు తాగితే చాలు మహారాజులమని బుకాయిస్తారు. అందరిని పిచ్చోళ్లలా చూస్తారు. ఎవరు అడ్డు వచ్చినా తోసేస్తారు. తమకు తామే హీరోలా భావించుకుని నానా హంగామా చేస్తారు. ఎవరైనా వారిస్తే వారినే గెంటేస్తారు. మత్తు దిగేదాకా వారికిష్టమైనదే చేస్తారు. మత్తు వదిలాక ఇక ఎవరి మొహం చూడకుండా చాటేస్తారు. అంతటి శక్తి మద్యానికి ఉంటుంది. అలాంటి మద్యంలో ఉన్న వ్యక్తి సృష్టించిన హంగామా చూస్తే మనకు ఇట్లే తెలుస్తోంది.

    చిత్తూరు జిల్లా చంద్రగరి నియోజకవర్గంలోని పాకాల మండలం వాల్లివేడు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణయ్య విచ్చలవిడిగా మద్యం తాగుతాడు. తనకు అడ్డు వచ్చిన వారిని నానా బూతులు తిడుతూ నిత్యం గొడవలు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో ఫుల్ గా తాగి హల్ చల్ చేశాడు. చేతిలో నాటు బాంబుల సంచి పట్టుకుని గ్రామంలో అందరిని బెదరగొట్టాడు. కిక్ సినిమాలో హీరోలా కిక్ కోసం ఊరంతా ఉరికించాడు. దీంతో ఊరంతా పరుగులు పెట్టారు.

    సోమవారం రాత్రి కృష్ణయ్య అతిగా మద్యం తాగాడు. ఓ చేతిలో మందు బాటిల్ మరో చేతిలో ఓ సంచి తీసుకుని గట్టిగా అరుస్తూ వీధుల్లో పరుగెత్తాడు. బయటకు రాకుంటే బాంబులు వేస్తానని బెదిరించాడు. దీంతో అందరు పరుగులు పెట్టారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. చేతిలో బాంబు పట్టుకుని పరుగు పెట్టాడు. చివరికి ఆ బాంబును ఓ ఖాళీ ప్రదేశంలో విసరగా అది పేలింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా కృష్ణయ్య పారిపోయాడు.

    గ్రామంలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? దేని కోసం తీసుకొచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వన్య ప్రాణులను వేటాడేందుకు తీసుకొచ్చి ఉంటారా? అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కృష్ణయ్య పట్టుబడితే తప్ప ఈ కేసులో నిజాలు తెలిసేలా లేవు. బాంబుల వెనకున్న మిస్టరీ వీడడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రశాంత మైన ఊరిలోకి బాంబుల మోత ఎందుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.