రాజస్థాన్ లోని బన్స్ వారా పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను ఎమ్మెల్యే రమీలాఖాడియా చెంపదెబ్బ కొట్టిన ఘటన సంచలనం రేపింది. బన్స్ వారా పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ మహేంద్రనాత్ డ్యూటీ సమయంలో ఓ వ్యక్తి బైక్ రాగా అతడిని ఆపి ఆరా తీశాడు. దీంతో బైక్ వచ్చిన వ్యక్తి హెడ్ కనిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతలో అక్కడకు ఎమ్మెల్యే రమీలాఖాడియా వచ్చారు. బైకిస్టును ఆపిన హెడ్ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగి అతన్ని చెంప దెబ్బ కొట్టారు. దీంతో ఎమ్మెల్యే రమీలాపై కేసు నమోదు చేశామని అదనపు ఎస్పీ కైలాష్ సింగ్ చెప్పారు.