
ఒక్కోసారి ఒక్క క్షణంలోనే జీవితం మారిపోతూ ఉంటుంది. సరిగ్గా అలాగే జరిగింది ఓ కుర్రాడి విషయంలో…. వివరాల్లోకి వెళ్ళితే కేరళకు చెందిన విజయన్ అనే యువకుడు కొన్న లాటరీ ద్వారా ఏకంగా 12కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కాగా ఫలితాలు రావడానికి కొన్ని గంటల ముందు తన మిత్రులతో తనకు మొదటి బహుమతి వస్తుందని నమ్మకంగా చెప్పిన విషయం కాస్త నిజం అవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ఇదివరకు ఇతనికి ఒక్కసారి లాటరీ ద్వారా 5000రూపాయలు బహుమతి గెలుచుకోవడం ఆసక్తికరం.