‘ఉయ్యాల జంపాల’ అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి హిట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ ‘విరించి వర్మ’. ‘ఉయ్యాల జంపాల’ సూపర్ హిట్ అయినా.. అందులో హీరోగా నటించిన రాజ్ తరుణ్ లాంటి అడ్రెస్ లేని హీరో కూడా.. ఆ తరువాత పదుల సినిమాలు చేసి.. తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ‘విరించి వర్మ’ మాత్రం ‘ఉయ్యాల జంపాల’ తరువాత మళ్లీ మూడేళ్లకు కానీ మరో సినిమాని పట్టుకోలేకపోయాడు. అన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నానితో మజ్ఞు అంటూ ఓ బిలౌవ్ ఏవరేజ్ సినిమా తీసి.. మళ్ళీ నాలుగేళ్ళుగా ఖాళీగా ఉంటున్నాడు. అయితే రెండు సంవత్సరాల క్రితమే కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.
Also Read: ‘రష్మికా మండన్న’ వల్ల వారికి అసంతృప్తి !
మరి అది ఏమైందో ఏమో.. మళ్లీ ఇంతవరకూ ఆ సినిమాకి సంబందించి మరొక అప్ డేట్ లేదు. ఈ మధ్యలో చాలా గ్యాసిప్ లు వినిపించాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ తో పాటు నారా రోహిత్ తో కూడా సినిమా ఉన్నది అని బలంగా వినిపించింది. కానీ ఆ సినిమా కూడా మెటీరియలైజ్ కాలేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విరించి వర్మకు నిర్మాత అనిల్ సుంకర ఓ సినిమా ఆఫర్ ఇచ్చాడట. లాక్ డౌన్ లేకుండా వుండి వుంటే ఇప్పటికి ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చి.. అధికారికంగా కూడా ప్రకటించేవారట. రచయిత దర్శకుడు బివిఎస్ రవి తయారుచేసిన స్క్రిప్ట్ ను విరించి వర్మ డైరక్ట్ చేయబోతున్నాడట.
Also Read: సీనియర్ నటి కస్తూరి కూడా లైగింక బాధితురాలేనా..!
మొదట ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాలనుకునప్పటికీ కొన్ని కారణాల వల్ల అనిల్ సుంకర దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదని.. ప్రస్తుతం తన చేతిలో వున్న సినిమాలు అన్నీ సెట్ రైట్ చేసుకున్నాక అనిల్ సుంకర ఈ సినిమా గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చేయడమనేది పక్కా అట. ఇక బివిఎస్ రవి తయారుచేసిన మరో స్క్రిప్ట్ తో నిర్మాత దిల్ రాజు, చైతన్య-విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో ఓ సినమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా నాని డైరెక్టర్ కి.. ఇన్నేళ్ళకు ఓ ఛాన్స్ వచ్చింది అన్నమాట.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Virinchi varma got movie offer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com