
తెలంగాణ రాష్ట్రంలో ఏడో విడత హరితహారం ప్రారంభోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ కలాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రిజర్వ్ పార్క్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన మొక్కటు నాటారు. అనంతరం మంత్రులు అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.