
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాను మే 31 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.