
కరోనా బీ.1.617 వేరియంట్ ను ఇండియన్ వేరియంట్ గా పేర్కొంటూ ఉన్న సమాచారాన్ని వెంటనే తొలగించాలని కేంద్రం సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు కేంద్ర ఇటీ శాఖ లేఖ రాసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భారత్ రకం వేరియంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తోందని తప్పుడు సమాచారం ఆన్ లైన్ వేదికగా వ్యాప్తి చెందుతోందని ఐటీ శాఖ లేఖలో పేర్కొంది. బీ.1.617 రంకం వేరియంట్ పై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చినట్లు గుర్తు చేసింది.