
వాయువ్య పాకిస్థాన్ లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజనీర్లు, పాకిస్థాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కొహిస్థాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.