
భాజపా నేత ఈటల రాజేందర్ ది ఆత్మ గౌరవం కాదని.. ఆత్మ వంచన అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈటల తాను మోసపోతూ ప్రజలనూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ల కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈటలకు తెరాస ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉంటూనే కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టారన్నారు. ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారని పేర్కొన్నారు.