
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ వివిధ యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో తాడేపల్లి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ జాతీయ రహదారి నుంచి సీఎం జగన్ ఇంటి ముట్టడికి తెదేపా అనుబంధ విభాగాలు తెలుగు యువత, టీఎస్ఎస్ఎఫ్ తో పాటు ఎస్ఎఫ్ఐ, వివిధ యువజన, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ ఐకాస ర్యాలీగా బయల్దేరాయి. దీంతో సీఎం నివాస పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.