https://oktelugu.com/

ఇలా అయితే ఎలా పవన్.. నిర్మాత పరిస్థితేంటి ?

క్రియేటివ్ డైరెక్టర్ అంటూ ఎప్పటికప్పుడు డప్పు వేయించుకునే అలవాటు గట్రా ఉన్న క్రిష్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నాడు. అయితే తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూట్ మాత్రం ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ ఎలాగోలా ఒకేసారి మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ నెట్టుకొస్తున్నాడు. దాంతో క్రిష్ సినిమా బాగా లేట్ అవుతుంది. […]

Written By:
  • admin
  • , Updated On : July 19, 2021 / 10:49 AM IST
    Follow us on

    క్రియేటివ్ డైరెక్టర్ అంటూ ఎప్పటికప్పుడు డప్పు వేయించుకునే అలవాటు గట్రా ఉన్న క్రిష్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నాడు. అయితే తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూట్ మాత్రం ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ ఎలాగోలా ఒకేసారి మూడు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ నెట్టుకొస్తున్నాడు.

    దాంతో క్రిష్ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. అలాగే నటీనటుల మేకప్ కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఇలా గ్యాప్ ఇస్తూ డేట్లు ఇస్తే… ఇక సినిమా ఎప్పటికీ పూర్తి చేయాలి ?

    పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు. అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది.

    ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాల స్లోగా సాగుతుంది షూటింగ్. ఈ లెక్కన వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమా ఇలాగే ల్యాగ్ తో షూట్ జరుపుకుంటూ ఉంటుందేమో. అలా అయితే, ఈ సినిమా నిర్మాత రత్నం పరిస్థితి ఏమిటో !