
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్షరేషన్ కఛ్చితంగా ఉండాలని బీజేపీ, టీడీప నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో సనాతంగా వస్తున్న సాంప్రదాయాలను మార్చే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఎప్పటి నుంచో ఉన్న డిక్లరేషన్ విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు.