village name change : తెలంగాణలో అనేక సమాజికవర్గాలు ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాల పేర్లు పలకడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ పేర్లును భూతు పదాలుగా భావిస్తున్నారు. దీంతో కొన్ని వర్గాలు తమ కులం పేరుతో తిట్టొద్దని ఆందోళనలు కూడా చేశాయి. ఇక రాష్ట్రంలో ఊర్ల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. కొన్ని ఆసక్తిగా అనిపించినా కొన్ని ఊళ్ల పేర్లు పిలవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో కాగజ్ కాగజ్‌నగర్ సమీపంలోని ల·జగూడ(Lanja guda) ఒకటి. కాగజ్‌నగర్ మండల కేంద్రానికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తమ ఊరి పేరు పలకడం అసభ్యకరంగా ఉండడంతో గ్రామస్తులు పేరు మార్చుకున్నారు. నందిగూడ అని పెట్టుకున్నారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పాత పేరు ఉంది. దీంతో దానిని మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే..
గ్రామ పేరు పలకడం ఇబ్బందిగా ఉందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణుల కోరికలను ప్రాతినిధ్యం చేసి, అధికారిక మార్పుకు మార్గం సుగమం చేయాలని కోరారు. రెవెన్యూ మంత్రి ఈమేరకు జోక్యం చేసుకోవాలని విన్నవించారు.
సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యత
పేరు మార్పులు తెలంగాణలో సాధారణం కావటంతో, ఇది స్థానిక సంస్కృతి, గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ’నందిగూడ’ పేరు గ్రామ చరిత్రకు సరిపోతుందని గ్రామస్తులు వాదన. రాజకీయంగా, ఎమ్మెల్యే చర్య ఓటర్లలో మంచి ఇంప్రెషన్‌ను సృష్టిస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, రికార్డుల మార్పు సులభంగా జరుగుతుంది. ఇది ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా మారవచ్చు. అయితే, డాక్యుమెంటరీ సవాళ్లు్ల, అధికారిక ఆమోదం ఆలస్యమవ్వకుండా చొరవ చూపాలి.
కాగజ్ నగర్ సమీపంలో ఉన్న ల*జగూడ అనే ఊరు పేరు మార్చాలి
గ్రామస్తులు నందిగూడ అని మార్చుకున్నారు, రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్చాలని కోరుతున్నాను – బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు pic.twitter.com/3WOxbXUILJ
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026