
ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికె్ జట్టు మళ్లీ అగ్రస్థాన్ని దక్కించుకుంది. గురువారం ప్రకటించిన యాన్యువల్ అప్డేట్ లో టెస్టు ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్ వన్ ర్యాంకును పదిలం చేసుకుంది. న్యూజిలాండ్ 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జూన్ లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.