
కీలకమైన 5వ టెస్టుకు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్ కు దూరమయ్యారు. జట్టు సహాయక బృందంలో మరొకరికి కరోనా సోకింది. ఈ కారణంగా ప్రాక్టీస్ ను రద్దు చేశారు. దీంతో ప్రాక్టీస్ లేకుండానే టెస్టుకు భారత జట్టు బరిలోకి దిగనుంది. ఇప్పటికే కరోనా కారణంగా కోచ్ రవిశాస్త్రి, ఇద్దరు సహాయక కోచ్ లు జట్టుకు దూరంగా ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఆఖరి టెస్టు రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారత్ 2-1 తో లీడ్ లో ఉంది.