Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir : సిరీస్ పోయింది.. నంబర్ వన్ ర్యాంకూ గంగలో కలిసింది..సిగ్గుపడు గంభీర్..

Gautam Gambhir : సిరీస్ పోయింది.. నంబర్ వన్ ర్యాంకూ గంగలో కలిసింది..సిగ్గుపడు గంభీర్..

Gautam Gambhir : గౌతమ్ గంభీర్.. భారత క్రికెట్ జట్టుకు శిక్షకుడిగా రాకమందు .. టెస్టులలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అప్పటికే రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. ఎప్పుడైతే అతడు అడుగుపెట్టాడో.. రకరకాల ప్రయోగాలు మొదలుపెట్టాడు. తన మూర్ఖత్వాన్ని.. తన పిచ్చితనాన్ని.. జట్టు మీద రుద్దడం మొదలుపెట్టాడు. ఫలితంగా రోహిత్ శర్మ జట్టు నుంచి వెళ్ళిపోయాడు.. విరాట్ కోహ్లీ అదే దారి అనుసరించాడు. రవిచంద్రన్ అశ్విన్ నావల్ల కాదు అంటూ వెళ్లిపోయాడు.. ఫలితంగా టీమిండియా పరిస్థితి టెస్ట్ లలో దారుణంగా మారింది. విజయాలు కాదు కదా.. కనీసం పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకొంది..

స్వదేశంలో న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా వంటి జట్ల చేతిలో వైట్ వాష్ కు గురైంది. దశాబ్దం తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ఓటమిపాలైంది. కేవలం బంగ్లాదేశ్.. జింబాబ్వే వంటి దేశాల పై మాత్రమే విజయాలు సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రవేశపెట్టిన తర్వాత.. రెండు సీజన్లలో ఫైనల్ దాకా వెళ్ళింది టీమిండియా. గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా అక్కడిదాకా వెళ్లడం కాదు.. కనీసం టాప్ 3 లో చోటు దక్కించుకోలేకపోయింది. టెస్ట్ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు టి20 ఫార్మాట్ లో కూడా టీమిండియా ఆట తీరు నేలచూపులు చూస్తోంది.

టి20 ఫార్మేట్ లో టీమిండియా 2024.. 2026 సంవత్సరాలలో ప్రపంచ కప్ లు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ వరకు ప్రతి జట్టు మీద విజయం సాధించి తిరుగులేని స్థాయిని అందుకుంది. ఇటీవల టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సరిగ్గా ఆడటంలేదని సూర్య కుమార్ యాదవ్ ను గంభీర్ పక్కనపెట్టాడు. అతడి స్థానంలో అయ్యర్ కు చోటు కల్పించాడు. కానీ అయ్యర్ నాయకత్వంలో ఇంతవరకు టీన్ ఇండియా ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐర్లాండ్ లాంటి జట్టు చేతులో టీమిండియా వైట్ వాష్ కు గురైంది.

ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాదాపు 1000 రోజులకు పైగా టి20 ఫార్మేట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఆస్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్ చేతిలో వరుసగా ఓడిపోవడంతో నెంబర్ వన్ స్థానాన్ని ఇంగ్లీష్ జట్టుకు ఇచ్చేసింది. టీమిండియా టి20 చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమిని ఇంగ్లాండ్ ద్వారా ఎదుర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే గంభీర్ శిక్షణలో టీమిండియా గొప్ప విజయాలు కాదు కదా.. దారుణమైన ఓటములను ఎదుర్కొంది. చరిత్రలో అత్యంత చెత్త రికార్డులను నమోదు చేసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular