
టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆలౌటైంది. మార్క్ వుడ్ వేసిన 126.1 ఓవర్ కు జడేజా (40) ఔటయ్యాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. సిరాజ్ (0) నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ల లో అండర్సన్ ఐదు వికెట్లు తీయగా రాబిన్ సన్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. మోయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.