TDP Mahanadu 2025: కడపలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు మహానాడు ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు కు మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. సీఎం ఎన్టీార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించారు.