https://oktelugu.com/

TDP Jana Sena Alliance: టీడీపీ-జనసేన కూటమికి ‘రెబల్స్’ భయం

175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 31 స్థానాలను త్యాగం చేసింది. 144 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు వివిధ రకాలుగా ఆశ చూసి వైసిపి నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 26, 2024 / 12:34 PM IST
    TDP Jana Sena Alliance

    TDP Jana Sena Alliance

    Follow us on

    TDP Jana Sena Alliance: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అధికార వైసిపి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. ఎక్కడికక్కడే అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగారు.కానీ కూటమి అభ్యర్థుల ప్రకటన కొలిక్కి వచ్చినా రెబల్స్ బెడద ఆ మూడు పార్టీలకు వెంటాడుతోంది.

    175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 31 స్థానాలను త్యాగం చేసింది. 144 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు వివిధ రకాలుగా ఆశ చూసి వైసిపి నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఎక్కడికక్కడే టికెట్ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. టికెట్లు దక్కని వారు రెబెల్స్ గా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ మూర్తులకు టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే చాలా చోట్ల సైతం అసంతృప్తి ఉంది.

    జనసేనలో సైతం నేతలు అసంతృప్తి బాట పడుతున్నారు. కందుల దుర్గేష్ ను ఎలాగోలా ఒప్పించి రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలు పంపించారు. విజయవాడ పశ్చిమ సీటు ఆశిస్తున్న పోతిన మహేష్, గిద్దలూరు టిక్కెట్ ఆశించిన ఆమంచి స్వాములు వంటి వారు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఓ పది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు ఇండిపెండెంట్ లతో ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే టికెట్ ఆశిస్తున్న వారితో నాయకత్వాలు మాట్లాడలేనట్లు తెలుస్తోంది. అందుకే వారు ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.

    వాస్తవానికి బిజెపి కూటమిలోకి మొన్న వచ్చింది. కానీ కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి రెండేళ్ల కిందటే.. చంద్రబాబు, పవన్ వచ్చారు. అటువంటిప్పుడు సీట్ల సర్దుబాటు ప్రక్రియపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పొ త్తులో భాగంగా ఏయే నియోజకవర్గాలు కోల్పోతారో.. అక్కడ నేతలను పిలిచి మాట్లాడాల్సింది. ఆ పని చేయకపోగా.. వైసీపీలో ఉన్న నేతలను సైతం పార్టీల్లోకి రప్పించారు. టికెట్లపై ఆశలు కల్పించారు. ఇప్పుడు వారికి టిక్కెట్లు దక్కకపోవడంతో రెబెల్స్ గా దిగేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇది ముమ్మాటికి కూటమిలోని నేతల స్వయంకృతాపమే.