Tata Tiago sales : దేశంలో కార్ల అమ్మకాల్లో TATA కంపెనీ మారుతి సుజుకి తో పోటీ పడుతోంది. మారుతి సుజుకి నుంచి మార్కెట్లోకి దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ఆర్ కారును ఇప్పటికీ ఆదరిస్తున్నారు. అయితే దీనికి పోటీగా టాటా నుంచి Tiago అందుబాటులోకి వచ్చి వ్యాగన్ఆర్ కు చెమటలు పట్టిస్తోంది. అయితే ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 7,00,000 విక్రయాలను చేసుకోబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ కారును వినియోగదారులు ఎంతగా ఆదరిస్తున్నారు అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
దేశీయ మార్కెట్లో బెస్ట్ హాచ్ బ్యాక్ కారుగా టాటా టియాగో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి సేల్స్ ఎప్పటికప్పుడు అత్యధికంగా నమోదు చేసుకుంటుంది. ఈ కారులో ఉండే ఫీచర్స్, ఇంజన్ పనితీరుతో పాటు మైలేజ్ మధ్యతరగతి ప్రజలను బాగా ఆకట్టుకుంది. అందుకే దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1,2 లీటర్ CNG ఆప్షన్ కలిగి ఉంది. పెట్రోల్ ఇంజన్ 75.5 Hp పవర్ తో పనిచేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. టాటా టియాగో కారు ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తుంది. ప్రస్తుతం EV కారుగా ఆదరణ పొందుతోంది. చివరగా ఈ కారు EV 2025 జనవరి లో అప్డేట్ అయింది. ఈ సమయంలో ఈ కారులో 19.2 kWh, 24kWh అనే రెండు బ్యాటరీ లో ఉన్నాయి. ఇవి వరుసగా 223, 293 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నాయి.
అయితే మిగతా వాటికంటే టాటా టియాగో తక్కువ ధరను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ నుంచి ఈవీ కార్ వరకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధర ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఈ కారు 2016 నుంచి 2026 చివరి వరకు 6,97,535 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. మరో 2,465 యూనిట్లు అమ్మితే 7 లక్షల మైలేజ్ కు చేరుకుంటుంది. ఈ అమ్మకాలు 2025 నవంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 6,721 ఉంటే ఇప్పటివరకు ఏడు లక్షలు చేరుకునేది. అయితే 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో 27% వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ మొత్తం 1.41 మిలియన్ ప్యాసింజర్ కార్లు మార్కెట్లో 49 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో 2019 ఆర్థిక సంవత్సరం Tiago కు ఉత్తమమైన సంవత్సరంగా పేర్కొంటారు. ఈ ఏడాదిలో ఈ కారు 92,369 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. మొత్తం కార్లలో టాటా టియాగో 5వ స్థానంలో నిలిచింది.