
సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అగ్రకథానాయకుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినీ దిగ్గజ నటుడు శ్రీ చిరంజీవిగారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారంతో సినీ కార్మికులు సినీ జర్నలిస్ట్ లకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం అని పేర్కొన్నారు.