
అఫ్గానిస్థాన్ లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంలో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ ఐఈవో అభిప్రాయపడింది. అఫ్టానిస్థాన్ లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని దేశీ ఎగుమతిదారులకు ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ సూచించారు. అఫ్గానిస్థాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోవడం, పరిస్థితులు అదుపు తప్పడం వంటి పరిణామాల కారణంగా కొంత సమయం పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంబించిపోవచ్చని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ ఖాన్ తెలిపారు. అనిశ్చితి తొలగిపోయిన తర్వాతే తిరిగి లావాదేవీలు ప్రారంభం కావచ్చని వివరించారు.