
అఫ్గనిస్థాన్ లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంపై పాకిస్థానీ హక్కుల కార్యర్త, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ దేశంలో మహిళలు, మైనారిటీలు హక్కుల పై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆమె తెలిపారు. ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం చూసి షాక్ కు గురయ్యాను. ఈ పరిస్థితుల్లో అక్కడి మహిళలు, మైనారిటీల హక్కుల రక్షణపై తీవ్ర అంతోళన చెందుతున్నానని ట్వీట్టర్ లో తెలిపారు.