భారత్, శ్రీలంక జట్టు సంయుక్తంగా టి20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ మొదలు కాబోతోంది. ఈ టోర్నీకి సంబంధించి ఆయా యాజమాన్యాలు జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది. ఇప్పుడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరిపోయాయి.
ఆస్ట్రేలియా యాజమాన్యం టి20 జట్టు విషయంలో ఈసారి అందరికీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా జట్టులో విజయవంతమైన సారధిగా పేరు తెచ్చుకున్న కమిన్స్ కు మొండి చేయి చూపించింది. వెన్నెముక గాయంతో బాధపడుతున్న కమిన్స్.. ఇటీవల చికిత్స పొందాడు. ఆ గాయం నుంచి కోలుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన యాషెస్ మూడో టెస్టులో ఆడాడు. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. తర్వాత కమిన్స్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఐదో టెస్ట్ ఆడేది కూడా అనుమానంగానే ఉంది. అతడికి ఈ నెల చివర్లో స్కాన్ నిర్వహించాల్సి ఉంది. స్కాన్ లో వచ్చిన ఫలితం ఆధారంగా అతడు జట్టులో ఉంటాడా? లేదా? అనేది తెలుస్తుందని ఆస్ట్రేలియన్ మీడియా చెబుతోంది. ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జిబెయిలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” హేజిల్ వుడ్, కమిన్స్ ప్రస్తుతం బాగానే ఉన్నారు. వారు కోలుకుంటున్నారు. డేవిడ్ కూడా బాగానే ఉన్నాడు. ఈ ముగ్గురు టోర్నీ నిర్వహించే సమయం వరకు జట్టుకు అందుబాటులోకి వస్తారని” అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్(కెప్టెన్), ఆడం జంప, మార్కస్ స్టోయినిస్, కూపర్ కానెల్లి, కమిన్స్, డేవిడ్, గ్రీన్, ఎల్లిస్, ఇంగ్లిస్, హెడ్, మాతృ కు హెన్మన్, మ్యాక్స్‌వెల్, షార్ట్.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ యాజమాన్యం ఈసారి కొత్త నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఆటగాడు రషీద్ ఖాన్ కు టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బాధ్యతలు అప్పగించింది.. ఇబ్రహీం ఉపసారథిగా ఉంటాడు. భుజం గాయం నుంచి కోలుకున్న నేపథ్యంలో పేసర్ నవీనుల్ హక్, లెఫ్ట్ ఆర్మర్ పేస్ బౌలర్ ఫారుకీ ని తీసుకున్నారు. ఆల్ రౌండర్ నైబ్, హాఫ్ స్పిన్నర్ రెహమాన్ జట్టులోకి వచ్చారు. మిస్టీరియస్ స్పిన్ పౌడర్ గజన్ ఫర్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. అంతేకాదు జనవరి 19న వెస్టిండీస్‌తో జరిగే మూడు t20 మ్యాచ్ ల సిరీస్ లో కూడా ఇదే జట్టు ఆడుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు
రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్(వైస్ కెప్టెన్), రెహమాన్ ఉల్లా గుర్బాజ్, అటల్, రసూల్, కమల్, అజ్మతుల్లా, నైబ్, రెహమాన్, నూర్ అహ్మద్, నవీన్ వుల్, ఓమర్ జాయ్, అహ్మద్ జాయ్.