
కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. 1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోను స్నేహితుడు పంపగా దాన్ని అభిమానులతో పంచుకున్నారు. కేటీఆర్ కరీంనగర్ లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్నప్పటి ఫోటో ఇది.