
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం డివిజన్ లో పనిచేస్తున్న ఇద్దరు రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారిని నిర్మల్ ఎఫ్ డీపీటీ వినోద్ కుమార్ సస్పెన్షన్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్ డీవో మాధవరావు తెలిపారు. ఇటీవల పైడిపల్లి బీట్ లో కలప స్మగ్లర్లు అడవులు నరికి విలువైన దుంగలను తీసుకెళ్లగా జన్నారం రేంజ్ ఆపీసర్ వెంకటేశ్వర్, చింతగూడ సెక్షన్ అధికారి సహేద పర్వీన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై సస్పెన్సన్ చేసినట్లు ఆయన తెలిపారు.