
ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు వ్యవహారంలో ఏబీఎన్, టీవీ5 ఛానళ్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. రిట్, కోర్టు ధిక్కరణ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. రెండు టీవీ ఛానళ్లపై దాఖలైన ఎఫ్ఐఆర్ విచారణపై న్యాయస్థానం స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఐడీకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల కౌంటర్లపై రెండు వారాల్లో సమాచారం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను 6 వారాలు వాయిదా వేసింది.