https://oktelugu.com/

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం

ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెయిలు దరఖాస్తుపై విచారణలో ఎవరూ కోరకుండానే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం మొత్తాన్ని చర్చిండం ఇబ్బందికరంగా ఉందని అత్యన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ చట్టం చట్టబద్ధత గురించి ఎవరూ హైకోర్టును ప్రశ్నించలేదనే విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాన్ని వివరించడం వల్ల దేశవ్యాప్త పర్యవసానాలు ఉంటాయని పేర్కొంది. ఈ చట్టాన్ని తానే (సుప్రీంకోర్టు) వివరించవలసిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 19, 2021 / 02:37 PM IST
    Follow us on

    ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెయిలు దరఖాస్తుపై విచారణలో ఎవరూ కోరకుండానే చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం మొత్తాన్ని చర్చిండం ఇబ్బందికరంగా ఉందని అత్యన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ చట్టం చట్టబద్ధత గురించి ఎవరూ హైకోర్టును ప్రశ్నించలేదనే విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాన్ని వివరించడం వల్ల దేశవ్యాప్త పర్యవసానాలు ఉంటాయని పేర్కొంది. ఈ చట్టాన్ని తానే (సుప్రీంకోర్టు) వివరించవలసిన అవసరం ఉందని తెలిపింది.