ఈటల ఎఫెక్ట్: టీఆర్ఎస్ సీనియర్లకు పదవులు?

అధిష్టానం దృష్టిలో పడేందుకు నాయకులు తాపత్రయ పడుతున్నారు. ఇటీవల పార్టీ నుంచి వెళ్లిపోయిన ఈటల రాజేందర్ ను చెడా మడా తిట్టేందుకు పోటీ పడుతున్నారు. తమ పదవులు కాపాడుకునే ప్రయత్నంలో అధినేత మెప్పు పొందాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పదవులు లేని వారు సైతం తమ వాణి వినిపిస్తున్నారు. ఈటలపై నిప్పులు చెరుగుతున్నారు. తమ పదవులు రెన్యువల్ చేసుకునే పనిలో భాగంగా సీనియర్లు పాటుపడుతున్నారు. ఎమ్మెల్సీ పదవుల కాలం అయిపోవడంతో వారు కూడా తమ పదవిని రెన్యువల్ […]

Written By: Srinivas, Updated On : June 19, 2021 4:58 pm
Follow us on

అధిష్టానం దృష్టిలో పడేందుకు నాయకులు తాపత్రయ పడుతున్నారు. ఇటీవల పార్టీ నుంచి వెళ్లిపోయిన ఈటల రాజేందర్ ను చెడా మడా తిట్టేందుకు పోటీ పడుతున్నారు. తమ పదవులు కాపాడుకునే ప్రయత్నంలో అధినేత మెప్పు పొందాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పదవులు లేని వారు సైతం తమ వాణి వినిపిస్తున్నారు. ఈటలపై నిప్పులు చెరుగుతున్నారు.

తమ పదవులు రెన్యువల్ చేసుకునే పనిలో భాగంగా సీనియర్లు పాటుపడుతున్నారు. ఎమ్మెల్సీ పదవుల కాలం అయిపోవడంతో వారు కూడా తమ పదవిని రెన్యువల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవీ కాలం అయిపోయింది. దీంతో ఖాళీగానే ఉన్నారు. ఇటీవల ఈటల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కేసీఆర్ ను పొగిడారు. ఈమధ్య శ్రీహరి బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం దీన్ని ఖండించలేదు. ఇప్పుడు ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న నమ్మకం లేకుండా పోతోంది. దీంతో ఈటలను తిడుతూ కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మాజీ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈటల రాజేందర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రస్తుతం సుఖేందర్ రెడ్డి పదవీ కాలం కూడా పూర్తయిపోయింది.

మరోమారు రెన్యువల్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి షరతులతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కానీ అది మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోయింది. ఇస్తారో లేదో తెలియదు. మండలి చైర్మన్ పదవిని పీవీ కుమార్తెకు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాననమండలిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఐదు స్థానాలు కొత్త వారితో భర్తీ చేయాలని డిసైట్ అయ్యారు. అందులో రెండు స్థానాలు మాత్రమే పాత వారికి రెన్యువల్ చేస్తారని ప్రచారం సాగుతోంది.