రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. తమకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకో్ర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపినట్లు తమకు కనిపించడం లేదంటూ దుష్యంత్ దవే వాదనలతో విభేదించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Supreme court hearing on insider trading
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com