Nimisha Priya Case: యెమెన్ లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న ప్రియకు ఉరిశిక్ష అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై నమోదైన పిటిషన్ ను విచారించేందుకు తాజాగా న్యాయస్థానం అంగీకరించింది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీకోర్టు అంగీకరించింది.