Sudigali Sudheer : బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మన ఇండస్ట్రీ కి ఎంతమంది టాలెంటెడ్ కమెడియన్స్ పరిచయమయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) కి ఉన్న క్రేజ్ వేరు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సుధీర్, ప్రారంభం లో మెజీషియన్ గా కొనసాగేవాడు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapoorna Studios) చుట్టూ అనేక మ్యాజిక్ షోస్ చేస్తూ కనిపించాడు. ఇతనిలో చలాకీ తనంని గమనించిన ‘బలగం’ వేణు తన టీం లోకి తీసుకున్నాడు. అలా జబర్దస్త్(Jabardasth Comedy Show) లోకి అడుగుపెట్టిన సుధీర్ ప్రయాణం ఎలా సాగిందో మనమంతా కళ్లారా చూసాము. చూస్తూ ఉండగానే ఆయన పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయాడు. టీవీ నుండి సినిమాల్లోకి వెళ్లిన ఆయన హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు టీవీ షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే, సుధీర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను కంగారు పెడుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే కమెడియన్ ధనరాజ్(Dhanaraaj) రామం రాఘవం అనే చిత్రం చేశాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించాడు. సముద్ర ఖని కీలక పాత్ర పోషించిన ఈ సినిమా, ఈ నెల 22వ తారీఖున జరగనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా సుడిగాలి సుధీర్ పాల్గొన్నాడు. సుధీర్ లేటెస్ట్ అవతారాన్ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఎలా ఉండే సుధీర్ ఇలా అయిపోయాడేంటి, ఇంత సన్నగా అవ్వడానికి కారణం ఏమిటని ఆందోళన చెందారు. దీనిపై అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ ‘సుధీర్ కి గత కొద్దిరోజుల నుండి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్ బెడ్ మీద చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అతను హాస్పిటల్ నుండే నేరుగా ఇక్కడికి వచ్చాడు’.
‘నిన్న సాయంత్రం ఫోన్ చేసి, వస్తున్నావా సుధీర్ అని అడిగితే, వస్తున్నాను అన్నాడు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయిన నా మీద అభిమానం తో సుధీర్ ఇక్కడికి వచ్చాడు. మాములుగా వాడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడం తక్కువ, వచ్చిన ఎక్కువ మాట్లాడలేడు. అలాంటిది నాకోసం వచ్చాడు. ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ వాడు హాస్పిటల్ కి వెళ్ళాలి. కాబట్టి తొందరగా నా ప్రసంగాన్ని ముగించేస్తున్నా’ అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సుధీర్ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో తో పాటు, ఆయన ‘గోట్’ అనే చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. చాలావరకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఒక పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
