
ఉత్తరాఖండ్ లో మరోసారి ఆకస్మిక వరదలు నష్టాన్ని కలిగించాయి. గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో ఉత్తరాఖండ్ లోని తేహ్రీ ప్రాంతం వణికిపోయింది. వరదలకు పెద్ద ఎత్తున ఇండ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉత్తరాఖండ్ గజగజలాడుతున్నది. కొవిడ్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలను మూసివేశారు. దాంతో ప్రాణ నష్టం జరగలేదు.