Success Mindset : ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచే డబ్బు అందుబాటులో ఉంటుంది. ఆ వ్యక్తికి కావలసిన సౌకర్యాలు తల్లిదండ్రులు అందిస్తారు. వారి పిల్లలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటారు. పెరిగే వ్యక్తి సైతం తనకు సమాజం గురించి ఏ విషయం తెలియకుండా.. కష్టం గురించి పరిచయం కాకుండా జీవితాన్ని పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతాడు. మరో వ్యక్తి చిన్నప్పటి నుంచే కష్టాలను ఎదుర్కొంటాడు. ఇతనికి తిండి దొరకదు.. ప్రతి విషయంలో బాదే ఉంటుంది.. కష్టాలు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి.. ఇలాంటి వ్యక్తి డబ్బున్న వ్యక్తిని చూసి తన జీవితం అలా ఉంటే బాగుండు.. అని అనుకుంటాడు.. వాస్తవానికి ఒక విజయం సాధించాలని అనుకునే వ్యక్తికి ఈ రెండింటిలో ఎలాంటి జీవితం ఉండాలి? వీరిలో ఎవరు విజయం సాధిస్తారు?
కొందరిని పుట్టగానే బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టావు.. అని కీర్తిస్తారు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండి.. ఎలాంటి కష్టం లేకుండా డబ్బు కూడా వస్తూ ఉంటుంది. కావలసిన చదువు.. తినాలనుకున్న ఆహారం.. ఎక్కడికి వెళ్లాలన్నా కార్లు.. ఇలా అన్ని అందుబాటులో ఉంటాయి. ఆ వ్యక్తి కేవలం చదువుకొని ఆ తర్వాత తనకు తగిన ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తికి జీవితంలో ఎలాంటి తృప్తి ఉండదు. ఎందుకంటే తాను ఒక వస్తువును ఎలా సంపాదించాలి? అన్న విషయం నేర్చుకోడు. అలాగే డబ్బు సంపాదన కోసం ఏ విధంగా కష్టపడాలి? అన్న విషయం తెలియదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మర్యాదగా ఉండాలి? అన్న విషయం అవగాహన ఉండదు. దీంతో అతడు కేవలం తన తల్లిదండ్రులు లేదా పూర్వీకుల నుంచి వస్తున్న డబ్బులు ఖర్చు పెడుతూ మాత్రమే జీవిస్తాడు.
కానీ మరో వ్యక్తి చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటాడు. తినడానికి తిండి లేని పరిస్థితి ఉంటుంది. కష్టాల మధ్య చదువులు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఒకటి వెంట ఒకటి బాధలు ఉంటాయి. ఉద్యోగాని కోసం ప్రయత్నం చేయడంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొంటాడు. డబ్బులు సేకరించడంలో తీవ్ర కష్టాలు పడతాడు.. అయితే ఇలాంటి వ్యక్తులే చివరికి విజయం సాధిస్తారు.
చాలామంది అనుకునే మాట ఏంటంటే.. తనకు అన్ని సౌకర్యాలు ఉంటే జీవితంలో విజయం సాధిస్తాను అని.. వాస్తవానికి అన్ని సౌకర్యాలు ఉన్నవారు ఎవరు అనుకున్న విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే ఎలాంటి సౌకర్యాలు లేనివారే కష్టపడుతూ ఉంటారు. ఒక వస్తువును పొందడానికి ఎలాంటి కష్టం చేయాలని నైపుణ్యాన్ని నేర్చుకుంటాడు. ఇతరులతో ఎలా మాట్లాడాలి? అనే విషయాన్ని ఎన్నో అవమానాల ద్వారా తెలుసుకుంటాడు. కుటుంబ సభ్యుల సంబంధాలు లేకపోతే తనకు ఎలాంటి కష్టం ఉంటుందో.. అవగాహన వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక గెలుపుకు సంబంధించిన అన్ని లక్షణాలను అతడు నేర్చుకొని.. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లి.. విజయం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు అనుకున్న విజయాన్ని సాధిస్తాడు. అందువల్ల జీవితంలో కష్టాలు, బాధలు, అవమానాలు ఉంటే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గెలుపుకు కావలసిన లక్షణాలు ఇవే..