https://oktelugu.com/

Modi: సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మన రణ నివాదం కావాలి.. మోదీ

సబ్ కా సాథ్, సబ్ కావికాస్, సబ్ కా విశ్వాస్ మన రణ నినాదం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలన్నారు. 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య 25 ఏళ్లకాలం అమృత ఘడియలని, అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలని చెప్పారు. కేవలం సంకల్పం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 15, 2021 / 09:05 AM IST
    Follow us on

    సబ్ కా సాథ్, సబ్ కావికాస్, సబ్ కా విశ్వాస్ మన రణ నినాదం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలన్నారు. 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య 25 ఏళ్లకాలం అమృత ఘడియలని, అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలని చెప్పారు. కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదని.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే సకారం అవుతుందన్నారు. సమస్త పౌరల భాగస్వామ్యంతో సమృద్ధ భారత నిర్మాతం సాధ్యమవుతుందన్నారు. అన్ని లక్ష్యాల సాధనకు సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ చాలా ముఖ్యమన్నారు.