ఏపీలో జాబ్ క్యాలెండర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ సచివాలయం ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు.