
యాస్ తుఫాను నేపథ్యంలో బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు అన్ని విధాలా సహాయ సకారాలు అందించాలని, భద్రత కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. తుఫాను తీరానికి చేరుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అతి తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 26న ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటుతుందని పేర్కొంది.