Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల లో సాకుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ వాణిజ్య ఆందోళనల కారణంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పుడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 81,184 వద్ద ట్రేడవుతుండగా నిఫీ 51 పాయింట్ల నష్టంతో 26,664 వద్ద ఉన్నాయి.