దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం నాటి సెషన్ తో సరికొత్త గరిష్టాలను నమోద చేసిన బెంచ్ మార్క్ సూచీలు వారాంతాన ఫ్టాట్ గా ట్రేడింగ్ ముగించాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ఆరంభించి చివరకు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సమయనికి సెన్సెక్స్ 132పాయింట్లు కోల్పోయి 52,100 వద్దకు చేరగా, నిఫ్టి 20 పాయింట్ల నష్టంతో 15,670 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ రికార్డు గరిష్టాల వద్ద ట్రేడింగ్ మొదలవడం, కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచుతూ ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించడం మార్కెట్ల పై ప్రభావం చూపింది.