
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల వరుస భారీ లాభాల అనంతరం గురువారం నాటి ట్రేడింగ్ లో సూచీలు ఒడుదొడుకులకు లోనైనా లాభాలతో ముగిశాయి. ఉదయం 54,450 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఒడిదొడుకులు ఎదుర్కొంది. అనంతరం లాభాల్లోకి వెళ్లిన సూచీ చివరకు 123.07 పాయింట్ల లాభంతో 54,492,84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35.80 పాయింట్ల లాభంతో 16,294.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మెటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ ప్రధానంగా లాభాల్లో ముగిశాయి.