
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ప్రారంభించాయి. అనంతరం క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 218 పాయింట్లు దిగజారి 51,204 వద్ద కొనసాగుతుండగా నిష్టీ 60 పాయింట్ల నష్టపోయి 15,375 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.42 వద్ద కొనసాగుతోంది. గత వారపు భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఆసియా మార్కెట్లు వరుసగా మూడో వారమూ లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి.