Jagan: రాష్ట్ర ఆర్టిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్ తో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్ లో 24 శాతం తగ్గిందని ట్వీట్ చేశారు. కాగ్ నివేదికలే ఈ వివరాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించాయని దుయ్యబట్టారు. ఏప్రిల్ వివరాలు వెల్లడించడకుండా మేలో జీఎస్టీ ఆదాయంలో రికార్డులంటూ ప్రకటనలు చేస్తుందని జగన్ అన్నారు.