
నాటింగ్ హామ్ వేదికగా టీమ్ ఇండియా తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఇంగ్లాండ్ ఆట ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 1.1 ఓవర్లలో 25/0 స్కోర్ చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (11), డామ్ సిబ్లీ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 70 పరుగుల అధిక్యంలో ఉంది.