
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. గతంలో పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసిన ఈ సంస్థ తాజాగా 29 మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.ircon.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తం 29 ఉద్యోగ ఖాళీలలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా ఎస్&టీ ఉద్యోగ ఖాళీలు 6 ఓహెచ్‌ఈ ఉద్యోగ ఖాళీలు 17 ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ లో ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, ఎలక్ట్రికల్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఆగష్టు 16వ తేదీన సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు, ఆగష్టు 18, 20 తేదీలలో ఇతర అభ్యర్థులకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభించనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.