
ఆస్ట్రిలియా క్రికెట్ లో ఒకప్పుడు సత్తా చాటిన స్టార్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్ గిల్ కిడ్నాప్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. సిడ్నీలో బుధవారం తెల్లవారు ఝామున వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్ లో షేన్ వార్న్ ఓ వెలుగుతన్న సమయంలోనే మెక్ గిల్ కూడా అరంగ్రేటం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తరుఫున 44 టెస్టులు కూడా ఆడాడు. 50 ఏళ్ల మెక గిల్ ను గత నెల 14న ముగ్గురు వ్యక్తులు వచ్చి కిడ్నాఫ్ చేశారు. దూరంగా ఓ బిల్డింగ్ లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టారు. అతని నుంచి భారీ మొత్తం డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మొత్తానికి నలుగురిని అరెస్ట్ చేశారు.