Ross Taylor Retirement: న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మేట్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు రస టేలర్ ప్రకటించాడు. 2006 వ సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడుతున్న రాస్ టేలర్ న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడు. ఈయన అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కొనసాగు తున్నాడు.
బాంగ్లాదేశ్ తో శనివారం నుండి స్టార్ట్ కానున్న రెండు టెస్టుల సిరీస్ తన కెరీర్ లో ఆఖరి టెస్టు సిరీస్ అని ప్రకటించిన టేలర్, వచ్చే ఏడాది సమ్మర్ లో ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత పరిమితం ఓవర్ల క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్టు టేలర్ ప్రకటించాడు. అన్ని ఫార్మేట్లకి గుడ్ బై చెప్పిన టేలర్ డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రమే అదే అవకాశం ఉందని తెలుస్తుంది.
Also Read: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?
బాంగ్లాదేశ్ పై రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ పై ఆరు వన్డేల మ్యాచ్ లు తర్వాత రాస్ టేలర్ రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించాడు. న్యూజిలాండ్ తరపున అగాథ 15 ఏళ్లుగా మ్యాచ్ లు ఆడుతున్న రేస్ టేలర్ ఇప్పటి వరకు 445 మ్యాచ్ లు ఆడి 18,074 పరుగులు చేసి న్యూజిల్యాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు.
అలానే న్యూజిలాండ్ తరపున 100కి పైగా టెస్టులు ఆడిన నాలుగవ ప్లేయర్ గాను రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటి వరకు 110 టెస్టులు ఆడిన టేలర్ 7,584 పరుగులు చేసాడు. 37 ఏళ్ల రేస్ టేలర్ న్యూజిలాండ్ టీమ్ కు కెప్టెన్ గా కూడా పని చేసాడు. 2006లో కివీస్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు న్యూజిలాండ్ తరపున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కూడా ఉంది. 15 ఏళ్ల కెరీర్ లో 110 టెస్టులు, 233 వన్డేలు, 102 టీ20 మ్యాచ్ లు ఆడిన టేలర్ 40 సెంచరీలు నమోదు చేసాడు.
తన రిటైర్మెంట్ సందర్భంగా రాస్ టేలర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసాడు. ”న్యూజిలాండ్ జట్టుతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది.. ఇన్నేళ్ళపాటు జట్టుకి ప్రాతినిధ్యం వహించడం గొప్పగా ఉంది.. నాకు సపోర్ట్ గా నిలిచినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి థాంక్స్” అని టేలర్ చెప్పుకొచ్చాడు.
Also Read: జనవరి 2 తర్వాతనే పాన్ ఇండియా సినిమాలపై తుది నిర్ణయం