Gachibowli Stadium Stampede: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. గేట్ నంబర్ 2 వద్ద బ్రేక్ ఫాస్ట పంపిణీ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన ఓ యువతిని సమీపంలోని ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమెను గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు.