నేడు తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి నేడే కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 9 గంటలకు తమిళనాడు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. స్టాలిన్ తో పాటు 34 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. కరుణానిధి కాబినెట్ లో పనిచేసిన వారికి తన మంత్రి వర్గంలోను చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల పేర్లతో కూడిన జాబితాను రాజ్ […]

Written By: Suresh, Updated On : May 7, 2021 7:27 am
Follow us on

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి నేడే కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 9 గంటలకు తమిళనాడు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. స్టాలిన్ తో పాటు 34 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. కరుణానిధి కాబినెట్ లో పనిచేసిన వారికి తన మంత్రి వర్గంలోను చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల పేర్లతో కూడిన జాబితాను రాజ్ భవన్ లో సమర్పించారు స్టాలిన్. ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.