జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించిన స్టాలిన్

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తమిళనాడులో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించారు. అన్ని దినపత్రికలు, అన్ని మీడియా రంగాల్లో పని చేసే వారిని కరోనా యోధులుగా పరిగణించనున్నట్లు తెలిపారు. మహమ్మారి సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ జయకేతనం ఎగుర వేయగా  ఈనెల 7న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు జర్నలిస్టులను కరోనా యోధులుగా […]

Written By: Suresh, Updated On : May 4, 2021 10:38 am
Follow us on

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తమిళనాడులో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించారు. అన్ని దినపత్రికలు, అన్ని మీడియా రంగాల్లో పని చేసే వారిని కరోనా యోధులుగా పరిగణించనున్నట్లు తెలిపారు. మహమ్మారి సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ జయకేతనం ఎగుర వేయగా  ఈనెల 7న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.